క్రమశిక్షణ,ఐక్యతతోనే పార్టీ పటిష్టత

విధాత‌: విధానపరమైన అంశాల విషయంలో పార్టీ రాష్ట్ర నేతల్లో స్పష్టత లోపించినట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టత ముఖ్యమని, క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ, పార్టీ […]

క్రమశిక్షణ,ఐక్యతతోనే పార్టీ పటిష్టత

విధాత‌: విధానపరమైన అంశాల విషయంలో పార్టీ రాష్ట్ర నేతల్లో స్పష్టత లోపించినట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టత ముఖ్యమని, క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ చేపట్టాల్సిన న్యూ మెంబర్‌షిప్ డ్రైవ్‌, అందుకు అనుసరించాల్సిన విధివిధానాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 1న కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.