తమిళనటి గాయత్రి రఘురామ్‌ను సస్పెండ్ చేసిన బిజేపీ
మైనార్టీ విభాగం నేతకు బెదిరింపు ఫోన్ కాల్ లీక్ వివాదం విధాత: తమిళనాడు బిజేపీ నాయకురాలు, సినీ నటి గాయత్రి రఘురామ్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు, బిజేపీ ఓబీసీ నేత శివకు గాయత్రి రఘురామ్‌కు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో తమిళనాడు బిజేపీ ఈ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినందుకు మహిళా నేత గాయత్రి రఘురామ్‌ను ఆరు నెలల […]

మైనార్టీ విభాగం నేతకు బెదిరింపు ఫోన్ కాల్ లీక్ వివాదం
విధాత: తమిళనాడు బిజేపీ నాయకురాలు, సినీ నటి గాయత్రి రఘురామ్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు, బిజేపీ ఓబీసీ నేత శివకు గాయత్రి రఘురామ్‌కు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో తమిళనాడు బిజేపీ ఈ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినందుకు మహిళా నేత గాయత్రి రఘురామ్‌ను ఆరు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై ప్రకటించారు.
విచారణ పెండింగ్‌లో ఉన్నందున పార్టీ కార్యక్రమాల నుంచి OBC నాయకుడు సూర్య శివను దూరం పెట్టినట్లు చెప్పారు. డీఎంకే ఎంపీగా ఉన్న తిరుచ్చి శివ కుమారుడు సూర్య తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ విభాగంలో కొన్ని నియామకాలపై పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం చీఫ్ డైసీ సరన్‌ను ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిన టెలిఫోన్ సంభాషణ లీక్ అయిన నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సి వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ అంశంపై వచ్చే ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కనగ సభాపతిని ఆదేశించినట్లు అన్నామలై ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ తమిళ మహిళా నేత గాయత్రి రఘురామ్ దీనిని ఖండించారు. పార్టీ సస్పెండ్ చేయడంపై ఆమె వరుస ట్వీట్లను పోస్ట్ చేసింది.
అతను మొదటి రోజు నుంచి నన్ను పార్టీ నుంచి బయటకు పంపాలని కోరుకుంటున్నాడని, కానీ నేను మరింత బలంగా తిరిగి వస్తానంటూ ఎవరి పేరు లేకుండా ఆమె ట్వీట్ చేశారు. ఆమె బీజేపీకి వ్యతిరేకి అన్న ఆరోపణను కూడా గాయత్రి రఘురామ్ తోసిపుచ్చారు, పార్టీ అనేది వ్యక్తిగత విషయాలకు అతీతమైందని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి “విచారణ లేకుండా” తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, విదేశాల్లో చిక్కుకుపోయిన తమిళులను సొంత ఖర్చులతో రక్షించానని, అలాంటి నన్ను కాదని, ఇటీవల పార్టీలో చేరిన కొందరికి ప్రాముఖ్యత ఇవ్వడం విచారకరమని మరో ట్వీట్ చేశారు.