Corona: కొత్త కేసులు 37వేలు.. ఒక్క కేరళలోనే 25వేలు
విధాత,దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఎప్పటిలాగే సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. బుధవారం మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.53లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 37,875 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కేసులతో పోలిస్తే 21.03శాతం ఎక్కువ కావడం గమనార్హం. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. అటు కేరళలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. […]

విధాత,దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఎప్పటిలాగే సోమ, మంగళవారాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. బుధవారం మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.53లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 37,875 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కేసులతో పోలిస్తే 21.03శాతం ఎక్కువ కావడం గమనార్హం. తాజా కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. అటు కేరళలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 25వేలకు పైగా ఒక్క ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 189 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
అయితే కొత్త కేసుల కంటే మరోసారి రికవరీలే ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. నిన్న 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.22కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.48శాతంగా ఉంది. ఇక, దేశవ్యాప్తంగా మరో 369 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి 4,41,411 మందిని బలితీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,91,256 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.18శాతంగా ఉంది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 78.47లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 70.75కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.