కౌంటింగ్‌కు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనసరి
కోవిడ్ జాగ్రత్తల విషయంలో దేశవ్యాప్తంగా ఈసీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది.ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్‌టీపీసీఆర్ నెగిటివ్ […]

కోవిడ్ జాగ్రత్తల విషయంలో దేశవ్యాప్తంగా ఈసీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది.
ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్‌టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు, టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అభ్యర్థులు కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు, కేంద్రపాలిత పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గురువారం బెంగాల్‌లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2న వెలవడుతాయి.