Corona: రెండోసారి..50వేలలోపు కేసులు
2 శాతం దిగువకు క్రియాశీల రేటు కొత్తగా 48,698 కేసులు.. 1,183 మరణాలు విధాత,దిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు […]

2 శాతం దిగువకు క్రియాశీల రేటు
కొత్తగా 48,698 కేసులు.. 1,183 మరణాలు
విధాత,దిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా.. 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు..
తాజాగా 6లక్షల దిగువకు చేరాయి. క్రియాశీల రేటు 1.97 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 96.72 శాతానికి పెరిగింది. నిన్న 64,818 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలా ఉండగా.. రెండో దఫా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
31.50 కోట్ల మందికి టీకా..
కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది.నిన్న 61,19,169 మంది టీకా వేయించుకున్నారు.ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 31,50,45,926కి చేరింది.