భారతరత్న ఈసారి క‌రోనా వారియ‌ర్స్‌కు ఇవ్వండి

ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం లేఖ విధాత‌: కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ లేఖ రాశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి […]

భారతరత్న ఈసారి క‌రోనా వారియ‌ర్స్‌కు ఇవ్వండి

ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం లేఖ

విధాత‌: కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ లేఖ రాశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. భార‌తీయ వైద్యుల సంఘం లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు.