19 నుంచి డెము, మెము రైళ్లు

విడతల వారీగా 82 ట్రైన్లు అందుబాటులోకి విధాత,హైదరాబాద్‌: దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల నుంచి మరికొన్ని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఈ రైళ్లు రద్దయ్యాయి. గతంలో తిరిగే రైళ్ల స్థానే అదే మార్గంలో కొత్త నంబర్లతో ప్రత్యేక రైళ్లుగా ద.మ.రైల్వే పట్టాలు ఎక్కిస్తోంది. మొత్తం 82 రైళ్లను […]

19 నుంచి డెము, మెము రైళ్లు

విడతల వారీగా 82 ట్రైన్లు అందుబాటులోకి

విధాత,హైదరాబాద్‌: దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల నుంచి మరికొన్ని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఈ రైళ్లు రద్దయ్యాయి.

గతంలో తిరిగే రైళ్ల స్థానే అదే మార్గంలో కొత్త నంబర్లతో ప్రత్యేక రైళ్లుగా ద.మ.రైల్వే పట్టాలు ఎక్కిస్తోంది. మొత్తం 82 రైళ్లను నడపనుండగా అందులో 66 ప్యాసింజర్లు కాగా, 16 ఎక్స్‌ప్రెస్‌లు. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలుచేస్తామని.. ప్రయాణికులు సురక్షిత దూరం పాటించాలని ద.మ.రైల్వే జీఎం గజానన్‌ మల్య స్పష్టంచేశారు. ప్రయాణ సమయం మొత్తంలో మాస్క్‌లు ధరించాల్సిందేనని అన్నారు.

అందుబాటులోకి రానున్నవాటిలో.. కాజీపేట-సిర్పూర్‌టౌన్‌, వాడి-కాచిగూడ, డోర్నకల్‌-కాజీపేట, కాచిగూడ-మహబూబ్‌నగర్‌, కాచిగూడ-కరీంనగర్‌, సికింద్రాబాద్‌-కళబురిగి, కరీంనగర్‌-పెద్దపల్లి, విజయవాడ-డోర్నకల్‌, విజయవాడ-గూడూరు, కాకినాడపోర్ట్‌-విజయవాడ, నర్సాపూర్‌-గుంటూరు, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, రేణిగుంట-గుంతకల్‌, వరంగల్‌-సికింద్రాబాద్‌, గుంటూరు-విజయవాడ తదితర రైళ్లున్నాయి.