కోర్టులో కాల్పులు..నలుగురి మృతి
విధాత: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు […]

విధాత: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు.