సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా
విధాత : కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. బిజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటకీ బిఎల్ సంతోష్‌కు ఛాన్స్? ఆరెస్సెస్ […]

విధాత : కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు.
బిజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటకీ బిఎల్ సంతోష్‌కు ఛాన్స్?
ఆరెస్సెస్ సీనియర్ నేత, ప్రస్తుత బిజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న బిఎల్ సంతోష్ తదుపరి సీఎం కావొచ్చని వార్తలు వస్తున్నాయి. యడ్యూరప్ప స్థానంలో సంతోష్ కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు చెబుతున్నారు.