జడ్జిల రక్షణకు అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలకు లక్ష జరిమానా
విధాత: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జడ్జిల రక్షణకు చేపట్టిన చర్యలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ₹లక్ష జరిమానా విధించింది. జడ్జిల భద్రతకు తీసుకున్న చర్యలు చెప్పాలని గతవారం రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు స్పందించకపోవడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయాధికారులపై దాడుల సంఘటనలను సుమోటోగా విచారించిన సుప్రీం.. ఝార్ఖండ్ ధన్‌బాధ్ జడ్జి హత్య ఘటన అనంతర పరిస్థితులపై ఆరా తీసింది. ‘‘జాతీయస్థాయిలో ప్రత్యేక రక్షణదళంతో జడ్జిలకు భద్రత […]

విధాత: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జడ్జిల రక్షణకు చేపట్టిన చర్యలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ₹లక్ష జరిమానా విధించింది. జడ్జిల భద్రతకు తీసుకున్న చర్యలు చెప్పాలని గతవారం రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు స్పందించకపోవడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయాధికారులపై దాడుల సంఘటనలను సుమోటోగా విచారించిన సుప్రీం.. ఝార్ఖండ్ ధన్‌బాధ్ జడ్జి హత్య ఘటన అనంతర పరిస్థితులపై ఆరా తీసింది. ‘‘జాతీయస్థాయిలో ప్రత్యేక రక్షణదళంతో జడ్జిలకు భద్రత కల్పిస్తున్నాం. కోర్టుల భధ్రత రాష్ట్రాలకు ఇస్తే మంచిది’’ అని కేంద్రం అభిప్రాయపడింది.