ఆగస్టు రెండోవారంనుంచి థర్డ్‌వేవ్- ఎస్‌బిఐ సర్వే
విధాత,న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోందికానీ థర్డ్‌వేవ్ ముప్పు ఆగస్టు రెండోవవారంలో పొంచి ఉందని ఎస్‌బిఐ తాజా సర్వే హెచ్చరించింది. ఆగస్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కొవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ తన పరిశోధన నివేదికను రూపొందించింది. ఇక కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్‌లో ఉంటుందనీ ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన […]

విధాత,న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోందికానీ థర్డ్‌వేవ్ ముప్పు ఆగస్టు రెండోవవారంలో పొంచి ఉందని ఎస్‌బిఐ తాజా సర్వే హెచ్చరించింది. ఆగస్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కొవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ తన పరిశోధన నివేదికను రూపొందించింది. ఇక కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్‌లో ఉంటుందనీ ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది.
రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు
కరోనా థర్డ్ వేవ్ సగటు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో నమోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువగా ఉండనున్నట్లు గ్లోబల్ డేటా చెబుతోంది.ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమై.. నెలలోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది.ఇక వ్యాక్సినేషన్ల విషయానికి వస్తే.. దేశంలో సగటున రోజుకు 40లక్షల వ్యాక్సిన్లు ఇస్తున్నారు.దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు.