సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల
విధాత: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు వి డుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒక ప్రక టనలో తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆ న్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టో కెన్లు ఆన్లైన్లో […]

విధాత: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు వి డుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒక ప్రక టనలో తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆ న్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టో కెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 2 6 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టో కెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్ర మించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెం డు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయిం చుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీ సుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ ని యంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు స హకరించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నె లకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సె ప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.