ఉత్తర ప్ర‌దేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్ మృతి

విధాత‌: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కల్యాణ్ సింగ్ బాధపడుతున్నారు. లఖ్నవూలోని సంజయ్‌ గాంధీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. రెండుసార్లు యూపీకి సీఎంగా పని చేసిన కల్యాణ్‌ సింగ్‌.. రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2014 వరకు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1992లో బాబ్రీ మసీదు ఘటన సమయంలో యూపీకి […]

ఉత్తర ప్ర‌దేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్ మృతి

విధాత‌: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కల్యాణ్ సింగ్ బాధపడుతున్నారు. లఖ్నవూలోని సంజయ్‌ గాంధీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. రెండుసార్లు యూపీకి సీఎంగా పని చేసిన కల్యాణ్‌ సింగ్‌.. రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2014 వరకు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1992లో బాబ్రీ మసీదు ఘటన సమయంలో యూపీకి సీఎంగా కల్యాణ్‌ సింగ్‌ ఉన్నారు.