కర్ణాటక నాయకత్వ మార్పులపై స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప

విధాత,దిల్లీ: కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు.రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను.నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది. మరోసారి అధికారంలోకి రావడానికి కృషి చేస్తాను’’ అని యడియూరప్ప తెలిపారు. ఇటీవల భాజపా సీనియర్‌ నేత, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప గవర్నర్‌కు యడియూరప్పపై ఫిర్యాదు చేయడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపాయి. సీఎం తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం […]

కర్ణాటక నాయకత్వ మార్పులపై స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప

విధాత,దిల్లీ: కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు.రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను.నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది. మరోసారి అధికారంలోకి రావడానికి కృషి చేస్తాను’’ అని యడియూరప్ప తెలిపారు. ఇటీవల భాజపా సీనియర్‌ నేత, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప గవర్నర్‌కు యడియూరప్పపై ఫిర్యాదు చేయడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపాయి. సీఎం తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.