శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతం
విధాత: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అలాగే, మూడో దశ కరోనా హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 7 నుంచి అదే నెల 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితమవుతాయని చెప్పారు. వాహన సేవలన్నీ ఆలయప్రాకారానికి పరిమితమవుతాయని […]

విధాత: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అలాగే, మూడో దశ కరోనా హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబరు 7 నుంచి అదే నెల 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితమవుతాయని చెప్పారు. వాహన సేవలన్నీ ఆలయప్రాకారానికి పరిమితమవుతాయని వివరించారు. కాగా, గత ఏడాది కూడా శ్రీవారిని బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించిన విషయం తెలిసిందే.