భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లా..? అయితే బెడ్రూమ్‌లో ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..!

వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ప్ర‌తి జంట‌.. అన్యోన్యంగా, సంతోషంగా జీవించాల‌నుకుంటుంది. ఎలాంటి గొడ‌వ‌ల‌కు తావివ్వ‌కుండా నిండు నూరేళ్లు గ‌డ‌పాల‌నుకుంటారు భార్యాభ‌ర్త‌లు. కానీ కొన్ని జంట‌ల మ‌ధ్య త‌రుచూ గొడ‌వ‌లు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

  • By: raj    vaastu    Mar 19, 2024 1:52 AM IST
భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లా..? అయితే బెడ్రూమ్‌లో ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..!

వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ప్ర‌తి జంట‌.. అన్యోన్యంగా, సంతోషంగా జీవించాల‌నుకుంటుంది. ఎలాంటి గొడ‌వ‌ల‌కు తావివ్వ‌కుండా నిండు నూరేళ్లు గ‌డ‌పాల‌నుకుంటారు భార్యాభ‌ర్త‌లు. కానీ కొన్ని జంట‌ల మ‌ధ్య త‌రుచూ గొడ‌వ‌లు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఆ గొడ‌వ‌లు కాపురంలో చిచ్చురేపుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త లేకుండా చేస్తాయి. అయితే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు బెడ్రూమ్‌లోని వాస్తు దోషాలే కార‌ణం కావొచ్చ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. కాబ‌ట్టి ప‌డ‌క‌గ‌దిలో వాస్తు నియమాలు పాటిస్తే.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య బంధం ప‌దికాలాల పాటు ప‌దిలంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

బెడ్ ఏ దిశ‌లో ఉండాలి..?

చాలా ఇండ్ల‌లో ప‌డ‌క గ‌ది చిన్న‌దిగా ఉంటుంది. దీంతో ఏ దిశ‌లో అంటే ఆ దిశ‌లో మంచాన్ని ఉంచుతుంటారు. కానీ ఇలా బెడ్‌ను ఉంచ‌డం మంచిది కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వాస్తు ప్ర‌కారం బెడ్‌ను నైరుతి దిశ‌లో ఉంచ‌డం ఉత్త‌మ‌మ‌ని పేర్కొంటున్నారు. అలా వీలు కాక‌పోతే.. ద‌క్షిణం లేదా తూర్పు వైపు త‌ల పెట్టి నిద్రిస్తే మంచిద‌ట‌. దీంతో దంప‌తుల మ‌ధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మ‌రి మంచం ఏ ఆకారంలో ఉండాలి..?

చాలా మంది దంపతులు బెడ్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఇలా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం త‌ప్పు లేద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. మంచం ఆకారం స‌రిగా లేక‌పోయినా కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ట‌. కాబ‌ట్టి చ‌తుర‌స్రాకారంలో లేదా దీర్ఘ చ‌తుర‌స్రాకారంలో ఉన్న మంచాన్ని ఎంచుకుంటే మంచిద‌ని చెబుతున్నారు. దీని వ‌ల్ల దంపతుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

క‌ల‌ర్స్ కూడా ముఖ్య‌మే..

బెడ్రూంలోని గోడ‌ల‌కు క‌ల‌ర్స్ కూడా ముఖ్య‌మేన‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ప‌డ‌క‌గ‌ది గోడ‌ల‌కు లైట్ క‌ల‌ర్ పెయింట్స్ ఉండేలా చూసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేత గులాబీ, పీచ్ క‌ల‌ర్స్ భార్యాభ‌ర్త‌ల‌కు ఎంతో ఉత్తేజాన్నిస్తాయ‌ని, త‌ద్వారా గొడ‌వ‌లు మాయ‌మ‌వుతాయ‌ని చెబుతున్నారు. లైట్ క‌ల‌ర్స్ ప్ర‌శాంత‌త‌ను కూడా క‌లుగజేస్తాయ‌ని, దాంతో దంప‌తుల జీవితం ఎంతో ఆనంద‌దాయ‌కంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

వీటితో పాటు ప్రేమ‌ను ప్రేరేపించే క‌ళాఖండాలు ఉండేలా చూసుకోవాలి. సువాస‌న‌గ‌ల కొవ్వొత్తులు, స‌జీవ మొక్క‌లు, తాజా పువ్వులు వంటివి ఉండేలా చూసుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఇవి దంప‌తుల్లో పాజిటివ్ ఎన‌ర్జీని పెంపొందిస్తాయ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.