Capybara Attacks Woman | మహిళపై కాపిబారా దాడి..వీడియో వైరల్

సరస్సులో ఈత కొడుతున్న మహిళపై కాపిబారా దాడి చేసి వీడియో వైరల్ అయింది. తృటిలో తప్పించుకున్న మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది.

Capybara Attacks Woman | మహిళపై కాపిబారా దాడి..వీడియో వైరల్

విధాత : సరదగా సరస్సులోకి దిగి ఈతకొడుతున్న మహిళపై కాపిబారా అనే జంతువు చేసిన దాడి కలకలం రేపింది. నీటిలో ఈత కొడుతున్న మహిళ వద్ధకు అకస్మాత్తుగా దూసుకొచ్చిన కాపిబారా ఆమె తలజుట్టును నోట కరుచుకుని ఆమెపై దాడి చేసింది. మహిళ ఆ జంతువు నుంచి తప్పించుకునేందుకు గట్టిగా కేకలు వేస్తూ పెనుగలాడింది. కాపిబారా ఆమెను వీపు వెనుక నుంచి గట్టిగా పట్టుకుని అసభ్యకర దాడికి పాల్పడింది. అమె గట్టిగా అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయగా..ఒడ్డున ఉన్న ఆమె తరపు మగవాళ్లు కర్రలు పట్టుకుని రావడంతో ఆ జంతువు ఆమెను విడిచి దూరంగా వెళ్లిపోయింది.

తృటిలో కాపిబారా దాడి నుంచి తప్పించుకున్న మహిళ బతుకు జీవుడా అనుకుంటు నీటి నుంచి బయటపడింది. క్షిరదాల జాతికి చెందిన కాపిబారా ఆ మహిళను తమ ఆడజాతి కాపిబారాగా భ్రమించి దాడికి పాల్పడిందని..అందుకే ఆ జంతువు మహిళపై అసభ్యకర దాడికి పాల్పడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆ జంతువు మహిళను నీటిలోకి లాక్కెళితే ఊపిరాడక చనిపోయేదని..ఒడ్డున ఉన్నవారు కాస్తా ఆలస్యం చేసిన ఆమె ప్రాణపాయానికి గురయ్యేదని అభిప్రాయపడ్డారు. భారీ ఎలుక జాతికి చెందిన కాపిబారా ఎక్కువగా దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి.