Car Climbs House Wall | రోడ్డుపై కారు..ఇంటి గోడ ఎక్కింది..!

Car Climbs House Wall | రోడ్డుపై కారు..ఇంటి గోడ ఎక్కింది..!

Car Climbs House Wall | విధాత : రోడ్డుపైన దూసుకెలుతున్న ఓ కారు ఆకస్మాత్తుగా ఓ ఇంటిగోడ ఎక్కింది. అదేలా అనుకుంటున్నారా…ఓ డ్రైవర్ నిద్రమత్తులో చేసిన రాష్ డ్రైవింగ్ తో రోడ్డుపైన వెలుతున్న కారు..డివైడర్ ను ఢికొట్టి అదుపుతప్పి పకక్నే ఉన్న ఇంటి ప్రహారి గోడపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన మేడ్చ‌ల్ జిల్లా దుండిగ‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటు చేసుకుంది. శంభీపూర్ లో నిద్ర‌మ‌త్తులో కారు డ్రైవ్ చేస్తూ వ‌చ్చిన డ్రైవ‌ర్ రోడ్డుపై డివైడర్ పైకి దూసుకెళ్లాడు. అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న ఇంటిగోడ‌పైకి కారు ఎక్కించాడు.

కారు గోడపైకి దూసుకొచ్చిన భారీ శబ్ధంతో ఇంటి య‌జ‌మాని నిద్ర‌లేచి కారు గోడపైకి ఎక్కి ఉండటాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డ‌కు చేరుకుని క్రేన్ స‌హాయంతో కారును కింద‌కు దింపారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పెడుతున్నారు. అస‌లు గోడపైకి కారు ఎలా తీసుకెళ్లాడంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫార్ములా కార్ రేసులో మనోడిని పంపితే గెలుపు మనదే అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.