విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

విధాత‌: బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని విజయాసాయిరెడ్డి, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.