గుంటూరులో యువతి హత్యా ఘటనపై సీఎం ఆరా

కఠిన చర్యలకు ఆదేశంబాధిత కుటుంబానికి రూ.10లక్షల ప్రకటన విధాత,అమరావతి:గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత […]

గుంటూరులో యువతి హత్యా ఘటనపై సీఎం ఆరా

కఠిన చర్యలకు ఆదేశం
బాధిత కుటుంబానికి రూ.10లక్షల ప్రకటన

విధాత,అమరావతి:గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని., పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.