కోడి క‌త్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీ‌నివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జగన్ పై కోడి క‌త్తి తో దాడి చేసిన కేసులో శ్రీ‌నివాస్ నిందితుడిగా ఉన్నారు

  • మీడియాతో మాట్లావొద్దు

విధాత‌: కోడి క‌త్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీ‌నివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం వైఎస్ జగన్ పై కొడికత్తితో దాడి చేసిన కేసులో శ్రీ‌నివాస్ నిందితుడిగా ఉన్నారు. దాదాపుగా ఐదేళ్ల తరువాత అతడికి బెయిల్ లభించగా.. కేసు గురించి మీడియాతో మాట్లాడ వద్దని కోర్టు ఆంక్షలు విధించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హజరు కావాలని, రూ. 25 వేల పూచీకత్తు, 2 ష్యూరిటిలు సమర్పించాలంది. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడి జరిగిన విష‌యం తెలిసిందే..

Somu

Somu

Next Story