అనంత‌పురంలో రూ.720 కోట్లతో ఇండస్‌ జీన్‌

విధ‌త‌: ఏపీలోనే తొలి వ్యాక్సినేషన్‌ తయారీ యూనిట్‌ను అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఇండస్‌ జీన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ లిమిటెడ్‌ రూ.720 కోట్లతో బయో టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్‌ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో రూ.220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ సిద్ధమవుతున్న బయో టెక్నాలజీ యూనిట్‌ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేయనున్నారు.యూనిట్‌ను […]

అనంత‌పురంలో రూ.720 కోట్లతో ఇండస్‌ జీన్‌

విధ‌త‌: ఏపీలోనే తొలి వ్యాక్సినేషన్‌ తయారీ యూనిట్‌ను అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఇండస్‌ జీన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ లిమిటెడ్‌ రూ.720 కోట్లతో బయో టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్‌ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో రూ.220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ సిద్ధమవుతున్న బయో టెక్నాలజీ యూనిట్‌ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేయనున్నారు.
యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం సంద‌ర్శించారు. బయో మెడిసిన్‌ ఉత్పత్తి, ల్యాబ్స్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. బయో టెక్నాలజీ హబ్‌గా ఎదిగేందుకు అనంతపురం జిల్లాకు అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఇది రాష్ట్రంలో నెలకొల్పుతున్న తొలి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రమని, త్వరలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.