ఎత్తుకు పోయిన బ్యాగ్ను 24 గంటల్లోనే చేదించిన కృష్ణా జిల్లా పోలీసులు
విధాత: ఈ నెల 12వ ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న వారి వద్ద నుండి ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి బ్యాగ్ను తస్కరించగా, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చేసిన 24 గంటల్లోనే పోయిన బ్యాగ్ను అందించినందుకు ఆ కుటుంబం మొత్తం ఈరోజు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే తిరువూరు కు చెందిన చిన్న శేష చారి, వెంకట కుమారి, వారి కుమార్తె మహేశ్వరి ముగ్గురూ కలిసి వారి వ్యక్తిగత పనిమీద […]

విధాత: ఈ నెల 12వ ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న వారి వద్ద నుండి ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి బ్యాగ్ను తస్కరించగా, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చేసిన 24 గంటల్లోనే పోయిన బ్యాగ్ను అందించినందుకు ఆ కుటుంబం మొత్తం ఈరోజు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే తిరువూరు కు చెందిన చిన్న శేష చారి, వెంకట కుమారి, వారి కుమార్తె మహేశ్వరి ముగ్గురూ కలిసి వారి వ్యక్తిగత పనిమీద తెల్లవారు జామున 04.45 నిమిషాలకు మచిలీపట్నానికి ద్విచక్రవాహనంపై బయలుదేరగా, హనుమాన్ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి వెనక నుండి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి వారి వద్ద ఉన్న బ్యాగ్ను లాక్కొని వెళ్ళిపోయారు. వెంటనే హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు,కంగారు లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ మీ బ్యాగ్ ను అందించే బాధ్యత మాది అని భరోసా కల్పించారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్లిపోగా, 13వ తారీకు సాయంత్రం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేసి మీ బ్యాగ్ దొరికిందని మీ బ్యాగ్ మీ వస్తువులు తీసుకోవాలని సమాచారం అందజేయగా, ఆ కుటుంబం వెళ్లి వాటిని పరిశీలించి తమదిగా నిర్ధారణ చేసుకున్నారు. ఆ బ్యాగ్ లో ఉన్న 10,000/- రూపాయల నగదు, విలువైన డాక్యుమెంట్స్ 3 మొబైల్ ఫోన్లు అన్నీ ఉండడంతో సంతోష పడ్డారు. అందులో భాగంగా ఈరోజు ఎస్పీని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఎస్పీ మాట్లాడుతూ మీకు జరిగిన మంచికి ఇలా వచ్చి కృతజ్ఞతలు తెలిపడం చాలా సంతోషంగా ఉందని, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా అభినందనీయం అన్నారు.ఆ కుటుంబం ఎస్పి గారి తో మాట్లాడుతూ అలా పోయిన బ్యాగ్ దొరకడానికి చాలా సమయం పడుతుంది, లేదా దొరకదేమో అన్న ఆలోచనలో ఉన్న మాకు మీ చొరవతో పోయిన 24 గంటల వ్యవధిలోనే అప్పగించారని జిల్లా పోలీసు శాఖకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తపరిచారు.