Beauty Tips | సబ్జా గింజలతో అందం..! అదేలాగో తెలుసా..?
Beauty Tips | అందం( Beauty )గా లేరని బాధపడుతున్నారా..? మొటిమలతో సతమతమవుతున్నారా..? ముఖంపై ముడతలు ఆందోళన కలిగిస్తున్నాయా..? వీటన్నింటికి పరిష్కారం సబ్జా గింజలు( Sabja Seeds ).. ఈ గింజలను వాడడం వల్ల అందంగా తయారవొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Beauty Tips | కౌమార దశకు చేరుకున్న ప్రతి అమ్మాయి( Girl ).. అందం( Beauty )గా, నాజుగ్గా కనబడాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం కొందరు ఫేస్ క్రీమ్స్( Face Creams ) వాడుతుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్( Beauty Parlor )ను ఆశ్రయిస్తుంటారు. ఇంకొందరు నేచురల్‌గా లభించే పదార్థాలతో అందంగా తయారయ్యేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీటన్నింటితో పని లేకుండా.. వంట గదిలో లభించే సబ్జా గింజలతో( Sabja Seeds ) అందం సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు.. అందంగా కూడా తయారు అవొచ్చని చెబుతున్నారు.
సబ్జా గింజలతో మొటిమలు నయం..
ఉద్యోగాలకు వెళ్లే యువతులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. తద్వారా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొటిమలను నివారించాలంటే.. సబ్జా గింజలతోనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయని, ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉండడంతో పాటు మొటిమలు మాయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
చర్మం కాంతివంతంగా..
సబ్జా గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఇ చర్మాన్ని కాంతివంతంగా మార్చేస్తుంది. సబ్జా గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని, ఈ గింజల వల్ల చర్మానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుందని చెబుతున్నారు.
ముఖంపై ముడతల నివారణకు..
మూడు పదుల వయసు రాకముందే.. యువతుల ముఖంపై ముడతలు వచ్చేస్తుంటాయి. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు వేరే క్రీమ్స్ వాడకుండా.. సబ్జా గింజలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడితే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిన కలుపుకొని ముఖానికి రాసుకున్న తర్వాత.. గోరువెచ్చని నీటితో కడిగితే ముఖంపై ముడతలు మాయమై.. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.