మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని దిందోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని దిందోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దిందోరి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అమహై దేవ్రీ గ్రామంలో ఓ ప్రోగ్రామ్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.