నంద్యాల జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు హైద‌రాబాదీలు మృతి

నంద్యాల జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలోని న‌ల్ల‌గ‌ట్ల వ‌ద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది.

నంద్యాల జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు హైద‌రాబాదీలు మృతి

కర్నూల్ : నంద్యాల జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలోని న‌ల్ల‌గ‌ట్ల వ‌ద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదం బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను హైద‌రాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారు తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రమాదానికి గురైన కారు నంబ‌ర్ టీఎస్ 08 జీఈ 1680.