బీహార్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
బీహార్‌లోని లఖిసరాయి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పాట్నా : బీహార్‌లోని లఖిసరాయి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను మొదట సదర్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోడ్రైవర్ మనోజ్ కుమార్ కూడా మృతి చెందాడు. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.