విద్యార్థినుల‌తో క‌లిసి స్టెప్పులేసిన ప్రిన్సిప‌ల్.. నెటిజ‌న్లు ఫిదా

కాలేజీ అంటేనే ఓ ఉల్లాసం, ఉత్సాహం. త‌మ చ‌దువుల‌ను కొన‌సాగిస్తూనే విద్యార్థులు ప‌లు క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటారు.

విద్యార్థినుల‌తో క‌లిసి స్టెప్పులేసిన ప్రిన్సిప‌ల్.. నెటిజ‌న్లు ఫిదా

కాలేజీ అంటేనే ఓ ఉల్లాసం, ఉత్సాహం. త‌మ చ‌దువుల‌ను కొన‌సాగిస్తూనే విద్యార్థులు ప‌లు క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటారు. ప్ర‌తి కాలేజీలో క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ నిర్వ‌హిస్తుంటారు. ఇక ఈ ఫెస్ట్‌లో భాగంగా చాలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. విద్యార్థులంతా ఆ యాక్టివిటీస్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో టీచ‌ర్లు కూడా పాల్గొని విద్యార్థుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు.

అయితే ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని గార్గి కాలేజీలో ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ నిర్వ‌హించారు. ఈ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వ‌హించారు. దీంట్లో ఆ కాలేజీ టీచ‌ర్లు కూడా పాల్గొన్నారు. అయితే కాలేజీ ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ సంగీత భ‌టియా.. విద్యార్థినుల‌తో క‌లిసి ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. ప్రిన్సిప‌ల్ డ్యాన్స్ చేసి విద్యార్థినుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రిన్సిప‌ల్ స్టెప్పులేయ‌డంతో ఆ హాల్ అంతా అమ్మాయిల కేరింత‌ల‌తో మార్మోగిపోయింది. ఈ ఫెస్ట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

విద్యార్థినుల‌తో క‌లిసి ప్రిన్సిప‌ల్ ర్యాంప్ వాక్ చేయ‌డం, ఆ త‌ర్వాత డ్యాన్స్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ప్రిన్సిప‌ల్ అంటే ఇలా ఉండాల‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఈ వీడియోను 2.8 మిలియ‌న్ల మంది వీక్షించ‌గా, 1.4 ల‌క్ష‌ల మంది లైక్ చేశారు.