ప్రశాంత్, రతిక మధ్య కోల్డ్ వార్..ఎవిక్షన్ పాస్ అర్జున్ సొంతం

బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుంది. నామినేషన్స్ సమయంలోను, టాస్క్‌ల సమయంలోను తెగ రెచ్చిపోతున్నారు. 11వ వారం నామినేషన్స్ తెగ హీటెక్కిపోగా, ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు యావర్, అమర్, ప్రియాంక, శోభా శెట్టి, రతిక, గౌతమ్, అర్జున్, అశ్విని ఉన్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ పెట్టారు. ఇంట్లో ఉన్న మొత్తం 10 మంది కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఏ ఏ స్థానానికి అర్హులో చెప్పాలని..ఆయా స్థానాల్లో వారు ఎందుకు అర్హులో తెలియజేయాలని బిగ్ బాస్ చెప్పాడు.
ఈ క్రమంలో మళ్లీ హౌజ్‌మేట్స్ మధ్య పెద్ద డిస్కషనే నడిచింది . ముందుగా రతిక తాను 5 వ స్థానానికి అర్హురాలిని అని చెప్పగా, ఇంటి సభ్యులు మాత్రం ఓటింగ్ ప్రకారం ఆమెకి 10 వ ర్యాంక్ కేటాయించారు. అశ్వినికి 9 వ ర్యాంక్ కేటాయించారు. అమర్ 6 వ ర్యాంక్ కి అర్హుడని తెలిపారు. ఇక శోభా శెట్టికి 5వ రాంక్ ఇవ్వగా, ఈ విషయంలో శోభాశెట్టి.. అర్జున్‌తో వాగ్వాదానికి దిగింది.అర్జున్…శోభాశెట్టి గురించి మాట్లాడుతూ ఆమెకి 7వ ర్యాంక్ కరెక్ట్ అని అన్నాడు. కేవలం అదృష్టంతోనే ఆమె నెట్టుకొస్తుంది తప్ప పెద్దగా చేసింది ఏమి లేదని అర్జున్ అన్నాడు. అతని మాటలకి శోభా కన్నీళ్లు పెట్టుకుంది.
నా కష్టాన్ని లక్ అనే చిన్న మాటతో తీసి పడేస్తే ఎలా అంటూ తెగ బాధ పడింది. ఇక ప్రియాంకకి 4వ ర్యాంక్, ప్రశాంత్ కి 3వ ర్యాంక్, శివాజికి నెంబర్ 1 ర్యాంక్, యావర్ 2, గౌతమ్, అర్జున్‌లకి 7,8 ర్యాంకులు ఇచ్చారు. అయితే ప్రశాంత్ పై రతిక పలు ఆరోపణలు చేసింది. మొదటి నాలుగు వారాలు నువ్వు ఆడింది ఏమి లేదు.నా వల్లే నీకు కలిసి వచ్చింది అని రతిక పేర్కొంది. దీనికి ప్రశాంత్ గట్టిగానే స్పందించాడు. నాకు సాయం చేసింది శివాజి అన్న. జీవితాంతం అన్నని గుర్తు పెట్టుకుంటా. నువ్వు నా ఇంట్లో వాళ్లని కూడా దారుణంగా అన్నావ్ అని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాటమ్ 5 లో ఉన్న వారు ఎవిక్షన్ పాస్ గెలుచుకునే టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ తెలియజేయడంతో అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నందున వారు ఆ టాస్క్‌లో పాల్గొంటారు. ఎవిక్షన్ అని రాసి ఉన్న బ్రిక్స్ ని కరెక్ట్ గా సెట్ చేసి గంట మోగించిన వారు విజేత అని బిగ్ బాస్ తెలియజేయగా, ఈ టాస్క్ లో అర్జున్ విజయం సాధించి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.