సిక్కింలో ఘోర ప్ర‌మాదం.. 16 మంది సైనికులు మృతి

విధాత: సిక్కింలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఆర్మీ సైనికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. దీంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ముగ్గురు జూనియ‌ర్ క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్లు, 13 మంది సైనికులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ సైనికుల‌ను హెలికాప్ట‌ర్‌లో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చాటెన్ నుంచి తంగు ప్రాంతానికి వెళ్తుండ‌గా జెమా ప్రాంతంలో బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు ఆర్మీ ఉన్న‌తాధికారులు తెలిపారు.

సిక్కింలో ఘోర ప్ర‌మాదం.. 16 మంది సైనికులు మృతి

విధాత: సిక్కింలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఆర్మీ సైనికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. దీంతో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

మృతుల్లో ముగ్గురు జూనియ‌ర్ క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్లు, 13 మంది సైనికులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ సైనికుల‌ను హెలికాప్ట‌ర్‌లో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

చాటెన్ నుంచి తంగు ప్రాంతానికి వెళ్తుండ‌గా జెమా ప్రాంతంలో బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు ఆర్మీ ఉన్న‌తాధికారులు తెలిపారు.