బన్నీని పట్టుకొని తెగ ఏడ్చేసిన అభిమాని.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమాలలోకి వచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అక్కడ నుండి దూసుకుపోతూ మంచి హిట్స్ అందుకుంటూ టాప్ హీరోకి చేరాడు. స్టైలిష్ స్టార్‌గా బన్నీకి మంచి గుర్తింపు దక్కింది. అయితే పుష్ప సినిమాతో బన్నీ ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బన్నీకి క్రేజ్ ఉంది. ఆయనకి దేశమంతటా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్స్ దగ్గర చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది.
ఇక ఆయనని కలిసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.ఛాన్స్ దొరికితే ఎక్కడికైన వెళ్లేందుకు వెనకాడరు. అయితే ఓ అభిమానికి మాత్రం బన్నీని ఆయన నివాసంలో కలిసే అవకాశం దక్కింది. రీసెంట్‌గా బన్నీ ఇంటికి వెళ్లిన అభిమాని ఆయనని హగ్ చేసుకుంటూ చాలా భావోద్వేగానికి గురవుతాడు. తన అభిమాన హీరోను దగ్గరుండి చూసి..కలిసే అవకాశం రావడంతో కుర్రాడి ఆనందానికి అవధులు లేవు. బన్నీని దగ్గరగా చూసే సరికి ఆనందం కట్టలు తెంచుకొని కన్నీటి రూపంలో అది బయటకు వచ్చింది.బన్నీని పట్టుకుని బోరున విలపించాడు. దీంతో ఏడుస్తున్న అభిమానిని ఓదారుస్తూ అతడికి ధైర్యం చెప్పి కాసేపు సరదగా మాట్లాడాడు అల్లు అర్జున్.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ చేసిన పనికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుండగా, మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటించగా , ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు..ఇక విజయ్ సేతుపతి, జాన్వీ కపూర్ కూడా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారంటూ టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీ దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు. మూవీకి సంబంధించిన ప్రకటన అల్లు అర్జున్ బర్త్ డే రోజు రానుంది.
A heartfelt moment captured! ❤️
Witness the touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. Emotions overflow as comforting words and a handshake create memories to last a lifetime.#AlluArjun pic.twitter.com/RS4NalS3kq
— All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) March 15, 2024