వాట్ ఏ టాలెంట్‌.. నీళ్ల‌పై బ‌న్నీ పుష్ప లుక్‌ని అచ్చం దించేసిన ఫ్యాన్

  • By: sn    breaking    Dec 09, 2023 11:23 AM IST
వాట్ ఏ టాలెంట్‌.. నీళ్ల‌పై బ‌న్నీ పుష్ప లుక్‌ని అచ్చం దించేసిన ఫ్యాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న క్రేజ్ ప్ర‌పంచ వ్యాప్తంగా పాకింది. పుష్ప సినిమాలో బ‌న్నీ త‌న మేన‌రిజంతో పాటు డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టాడు. ఆయ‌న టాలెంట్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. సామాన్యుల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు బ‌న్నీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కింది. అయితే ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మూవీ రూపొందుతుంది. ఈ సినిమా కోసం అంద‌రు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా బ‌న్నీ అభిమాని చేసిన ప‌నికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. dhrisha_suroiwal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ ఆర్టిస్ట్‌ పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో అల్లు అర్జున్ బొమ్మను వేయడం కనిపించింది. బొమ్మ మొత్తం పూర్తయ్యాక పుష్ప సినిమాలో మెడపై చేయి పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ పెట్టిన ఫోజు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆ బొమ్మ వేసిన ఆర్టిస్టు టాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క‌ర‌కాలుగా బ‌న్నీపై త‌మ అభిమానం చూపించ‌డం చూసాం. కాని ఇది మాత్రం చాలా స్పెష‌ల్ అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఫుష్ప ఫేమ్ జగదీష్ మహిళ హత్య కేసులో అరెస్ట్ కావడంతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, చిత్ర యూనిట్ తీవ్రమైన సమస్యలో ఇరుక్కుపోయారనే చెప్పాలి. జగదీష్ అరెస్ట్ కారణంగా షూటింగ్ నిలిచిపోయే అవకాశం ఉందనే విషయం మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. పుష్ప 2 సినిమాలో జగదీష్‌ పాత్ర ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా షూట్ చేయాల్సిన సీన్లు కూడా చాలా ఉండటంతో పరిస్థితిని ఎలా డీల్ చేయాలనే విషయంపై దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ మల్లగుల్లాలు పడుతున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.