24 ఏళ్ల క్రితం అనసూయ ఇలా ఉంది ఏంటి… లుక్ చూసి అందరు షాక్..!

అందాల యాంకర్ అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాంకరింగ్‌తో పాటు నటనతో ఎంతగానో అలరించిన అనసూయ తన గ్లామర్ షోతో కూడా రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకి చాలా డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కేక పెట్టించే లుక్స్‌తో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది అనసూయ. ఈ అమ్మడు జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అనుకోని కారణాల వలన వాటికి దూరంగా ఉంటూ ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తుంది. వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అనసూయ ఇప్పుడు బుల్లితెరకి పూర్తిగా దూరంగా ఉంటూ వెండితెరపై సందడి చేస్తుంది.
రంగస్థలం చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత చాలా చిత్రాలు చేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటించి మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప2తో అలరించబోతుంది. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని తెలిపింది. మొదట కొంతమంది NCC మెంబర్స్ ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి అందులో తాను ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ పరీక్ష పెట్టింది. ఈ పరీక్షలో కొందరు కరెక్ట్‌గా గెస్ చేయడంతో తను ఆ ఫోటోని జూమ్ చేసి తనని హైలైట్ చేసి చూపించింది.
ఇక 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది. స్కూల్ లెవల్లో నేను AP జూనియర్ వింగ్ NCC కమాండర్ ని. అప్పుడు 15 స్టేట్స్ తో పోటీపడి మేము థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాము అని అనసూయ స్పష్టం చేసింది.. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో NCC చాలా తోడ్పడింది అని చెప్పుకొచ్చిన అనసూయ ఇప్పుడు ఆ మెమరీ గుర్తొచ్చింది అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక ఆ ఫోటోకి అనసూయ .. 24 ఏళ్ళు అయిపొయింది, చాలా ఛేంజ్ అయ్యాను అంటూ కామెంట్ రూపంలో తెలిపింది. మరో పిక్ లో ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత ఇలా ఉన్నానంటూ తెలియజేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.