ఎట్ట‌కేల‌కి రెండో పెళ్లి చేసుకున్న స‌ల్మాన్ సోద‌రుడు..చక్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

ఎట్ట‌కేల‌కి రెండో పెళ్లి చేసుకున్న స‌ల్మాన్ సోద‌రుడు..చక్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. చాలా ఏళ్ల నుండి ప‌లువురితో ప్రేమాయ‌ణం న‌డిపిన స‌ల్మాన్ పెళ్లి అంటే నో అంటున్నాడు. అయితే స‌ల్మాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ మాత్రం తాజా రెండో పెళ్లి చేసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అర్బాజ్ ఖాన్ వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకోగా, వారి వివాహం అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జ‌రిగింది. ప్ర‌స్తుతం పెళ్లి ఫొటోలు నెట్టింట‌వైర‌ల్ అవుతున్నాయి.

పెళ్లి వేడుకలో సోదరులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మా ఖాన్,కుమారుడు అర్హాన్ ఖాన్‌తో సహా మొత్తం కుటుంబం పాల్గొంది. ఇక‌ రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా టాండన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక అర్భాజ్ ఖాన్‌కి ఇది రెండో వివాహం కాగా, ఆయ‌న గతంలో మలైకా అరోరాను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ 2016వ సంవత్సరం మార్చిలో విడిపోతున్నామని ప్రకటించారు. 1998వ సంవత్సరంలో వివాహం చేసుకున్న అర్బాజ్, మలైకా 19 సంవత్సరాల తర్వాత 2017 మే 11వతేదీన అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

అర్బాజ్ రెండో షురా ఖాన్ రవీనా టాండన్ మేకప్ ఆర్టిస్ట్ అని తెలుస్తుది. ఈ జంట అర్బాజ్ రాబోయే చిత్రం పాట్నా శుక్లా సెట్స్‌లో కలుసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రవీనాతో పాటు మానవ్ విజ్ మరియు చందన్ రాయ్ సన్యాల్ నటించారు. దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా ఈ చిత్రంలో భాగం అయ్యారు. ఈ మూవీ సెట్స్‌లో క‌లిసిన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం, వారుపెళ్లిచేసుకోవాల‌ని అనుకోవ‌డం ఎట్ట‌కేల‌కి జ‌ర‌గ‌డం కూడా జరిగింది.