వేణుస్వామికి భలే గిరాకి పెరిగిందిగా..ఆయనతో పూజలు చేయించుకున్న మరో భామ

జ్యోతిష్యంపై కొందరు సినీ సెలబ్రిటీలకి నమ్మకం చాలానే ఉంటుంది.వారు కొందరు ప్రముఖుల దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటూ వారు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్స్ వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్నారు. వేణు స్వామి జ్యోతిష్యం చెప్పటంతో పాటు సెలబ్రిటీల ఇళ్లలో పూజలు, యాగాలు కూడా నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయతి వంటి హీరోయిన్స్ వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయించుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా వేణు స్వామి లిస్ట్‌లో హాట్ బ్యూటీ అషూ రెడ్డి చేరింది. అయితే ఆమె తన కొత్త కారుకి వేణు స్వామితో పూజలు చేయించుకుంది. గత పుట్టిన రోజుకి బెంజ్ రోవర్ కొన్న అషూరెడ్డి ఈ సారి రేంజ్ రోవర్ కొనుగోలు చేసింది. ఆ కారుకి వేణు స్వామి ప్రత్యేక పూజలు చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అషూ రెడ్డి జూనియర్ సమంత అని పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి సందడి చేసి మరింత పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మతో ఈ అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, మోడలింగ్ చేస్తూ అషురెడ్డి రెండు చేతులా బాగానే వెనకేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడప్పుడు సినిమాలలో, వెబ్ సిరీస్‌లలో కూడా కనిపిస్తూ అలరిస్తుంది. ఆమె ఘాటు అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇటీవల ఎక్కువగా విదేశాలలో కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతిసారి విదేశాలకి వెళ్లేంత డబ్బు నీకెక్కడి నుండి వస్తుందని కొందరు కామెంట్ కూడా చేశారు. మరోవైపు అషూ రెడ్డి డ్రగ్స్ ఆరోపణలు కూడా ఎదుర్కొంది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరకగా, అతని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న సెలెబ్స్ లో అషురెడ్డి పేరు కూడా ఉంది. ఆయనతో వందల కాల్స్ మాట్లాడినట్టు ఆధారాలు ఉండడంతో అషూ రెడ్డి కూడా డ్రగ్స్ కేసులో ఉందని పుకార్లు వచ్చాయి. కాని అవన్నీ కొట్టి పారేసింది ఈ భామ