మరోసారి మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ.. థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆసీస్

ఈ ఏడాది వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఆసీస్ జట్టు ఇప్పుడు భారత్‌తో ఐదు వన్డేల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు టీ 20లు విజయం సాధించిన టీమిండియా మూడో టీ20లో తేలిపోయింది. భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచిన కూడా అది కాపాడుకోలేకపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌ను భారత్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకోగా, తొలి ఓవర్లలో టైట్ బౌలింగ్ వేషారు. ఈ క్రమంలో జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) ఇద్దరూ త్వరగానే పెవీలియన్ బాట పట్టారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) ఇద్దరూ కూడా రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్)కి చక్కని సహాకరం అందించారు.
రుతురాజ్ మొదట్లో నెమ్మదిగా ఆడిన కూడా అర్ధసెంచరీ పూర్తయ్యాక విజృంభించాడు. బౌండరీలు, సిక్సర్స్‌తో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు అదిరే ఆరంభం ఇచ్చాడు ట్రావిస్ హెడ్. వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన హెడ్ ఈ సిరీసులో ఆడిన తొలి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. ధనాధన్ షాట్లతో భారత బౌలర్లపై ఎదురు దాడి చేసి ఔటయ్యాడు. హెడ్‌కి జతగా వచ్చిన ఆరోన్ హార్డీ (16) కూడా చక్కని షాట్స్ ఆడాడు. వీళ్లిద్దరూ కలిసి 4 ఓవర్లలోనే 47 పరుగులతో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇక తర్వాత వచ్చిన ఇంగ్లిస్ (10) , స్టొయినిస్ (17), టిమ్ డేవిడ్ (0) తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో భారత్ ఖాతాలో మరో విజయం చేరినట్టేనని భావించారు.
కాని ఒకవైపు వికెట్లు పడుతూనే ఉన్నా కూడా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్) చెలరేగాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసి ఆసీస్‌కి మంచి విజయం సాధించాడు.. అతనికి మాథ్యూ వేడ్ (28 నాటౌట్) మంచి సహకారం అందించగా, ఈ ఇద్దరు కలిసి ఆసీస్‌కి విజయం అందించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయి రెండు వికెట్లతో రాణించగా.. అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన నాలుగు ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇవ్వడం గమనార్హం. సిరీస్ లో తదుపరి మ్యాచ్ డిసెంబర్ 1న జరగనుంది.