breaking news : ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు.. 10 మంది విద్యార్థుల మృతి.. అనేక మందికి తీవ్ర గాయాలు

breaking news | ఆస్ట్రియా దేశంలో దారుణం చోటు చేసుకున్నది. మంగళవారం (6.10.2025) ఆ దేశంలోని ఒక ప్రైమరీ స్కూల్లో కాల్పుల ఘటనలో 10 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన గురించి తెలియగానే భద్రతా సిబ్బంది ఆ స్కూలు వద్ద భారీ ఆపరేషన్ చేపట్టారు. స్కూల్లోకి ప్రవేశించారు. ఈ కాల్పుల్లో కొందరు టీచర్లు, విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తున్నది. గ్రజ్ నగరంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం పది గంటలకు కాల్పులు జరిగిన వెంటనే ఆపరేషన్ చేపట్టామని ఆస్ట్రియా పోలీసులు తెలిపారు. 10 మంది చనిపోయినట్టు స్థానిక మీడియా క్రొననెన్ జెయిటుంగ్ తెలిపింది. పోలీసులు స్కూలు భవనాలను తనిఖీ చేస్తున్నారని తాజా వార్తలను బట్టి తెలుస్తున్నది. BORG డ్రీర్స్చుట్జెంగాస్సే స్కూల్లో జరిగిన కాల్పుల్లో పలువురు చనిపోయినట్టు ఆస్ట్రియా ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ధృవీకరించిందని పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఓఆర్ఎఫ్ తెలిపింది. కాల్పులకు పాల్పడిన దుండగుడు.. అనంతరం స్కూల్లోని ఒక టాయ్లెట్లోకి వెళ్లి తనను తాను కాల్చుకుని చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
కాల్పులు జరిగిన స్కూలు వద్ద పోలీసులు, భద్రతా దళాలు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
పోలీసులు ఆ మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించారు. క్లాసులో విద్యార్థులతో ఉన్న తన భార్య అనేక సార్లు కాల్పుల శబ్దాన్ని విన్నట్టు ఆమె భర్త తెలిపారు. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులను అనుమతించారు. గాయపడినవారిని సమీప హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 2025 జూన్ 20న గార్జ్ నగరంలో కాల్పులు చోటు చేసుకుని, ముగ్గురు ప్రజలు చనిపోయారు. ఈ ఘటనకు పదేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాజా కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇది బ్రేకింగ్ వార్త.. అప్డేట్స్ కోసం పేజీని రిఫ్రెష్ చేయండి..