ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

విధాత: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది. రాజాసింగ్‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను తెలంగాణ‌ హై కోర్టు మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని రాజాసింగ్‌ను కోర్టు ఆదేశించింది. వెంట‌నే రాజాసింగ్‌ను విడుద‌ల చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓ వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా రాజాసింగ్ చేసిన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి, నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఆయ‌న‌ను రిమాండ్ విధించి, చంచ‌ల్ […]

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

విధాత: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది. రాజాసింగ్‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను తెలంగాణ‌ హై కోర్టు మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని రాజాసింగ్‌ను కోర్టు ఆదేశించింది. వెంట‌నే రాజాసింగ్‌ను విడుద‌ల చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఓ వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా రాజాసింగ్ చేసిన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి, నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఆయ‌న‌ను రిమాండ్ విధించి, చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఆగ‌స్టు నుంచి రాజాసింగ్ చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నారు.