అమ్మాయిల‌తో ఎక్కువ రిలేష‌న్స్.. అనుమానం క‌లిగించేలా బండ్ల గ‌ణేష్ కామెంట్స్

అమ్మాయిల‌తో ఎక్కువ రిలేష‌న్స్.. అనుమానం క‌లిగించేలా బండ్ల గ‌ణేష్ కామెంట్స్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి బండ్ల గ‌ణేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న న‌టుడిగా కెరీర్‌ని ప్రారంభించి త‌ర్వాత నిర్మాత‌గా స‌త్తా చాట్టాడు. అనంత‌రం రాజకీయాల్లోకి వెళ్లారు. కొన్నాళ్లు ఆ వైపు యాక్టివ్‌గా ఉన్న ఆయన త‌న‌కి అక్క‌డ సెట్ కాద‌ని మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ వైపే వ‌చ్చారు. ఇప్పుడు తిరిగి రాజ‌కీయాల‌పై దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో బండ్ల గ‌ణేష్ తెగ సంద‌డి చేస్తున్నారు. బండ్ల గణేష్‌.. పవన్‌ కళ్యాణ్‌తో తీన్‌మార్‌, గబ్బర్‌ సింగ్‌, ఎన్టీఆర్‌తో టెంపర్‌, బాడ్‌షా, రామ్‌ చరణ్‌తో గోవిందుడు అందరి వాడేలే, బన్నీతో ఇద్దరమ్మాయిలతో, రవితేజతో ఆంజనేయులు వంటి చిత్రాలను నిర్మించ‌గా, ఇందులో కొన్ని మంచి విజ‌యాలు సాధించాయి. టెంప‌ర్ త‌ర్వాత నిర్మాత‌గా దూర‌మైన బండ్ల‌.. సరిలేరు నీకెవ్వరు`తోపాటు `సన్‌ ఆఫ్‌ ఇండియా, క్రేజీ అంకుల్స్ చిత్రాల్లో నటుడిగా క‌నిపించి అల‌రించాడు.

అయితే బండ్ల గ‌ణేష్ సినిమాల‌తో పాటు వ్యాపారాలు కూడా చేస్తాడు. కోళ్ల ఫామ్స్, రియల్‌ ఎస్టేట్‌ మాత్రమే కాకుండా , పలు రహస్య వ్యాపారాలు కూడా చేస్తాడ‌ని స‌మాచారం. అయితే బండ్ల గ‌ణేష్ ఇప్పుడు చిన్న సినిమాలు తీసి స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. పెద్ద హీరోల కోసం వెయిట్ చేస్తే లాభం లేద‌నుకొని చిన్న సినిమాల‌ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో బండ్ల ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయనకు విచిత్ర‌మైన ప్ర‌శ్న ఎదురైంది. `మీరు అబ్బాయిలతో కంటే ఆడవాళ్లతోనే ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేస్తాన‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు బండ్ల‌.

అమ్మాయిల‌తో ఎక్కువ రిలేష‌న్స్.. అనుమానం క‌లిగించేలా బండ్ల గ‌ణేష్ కామెంట్స్తాను మందు తాగానని గానీ, ఆడవాళ్ల వద్ద తప్పు చేశాడని గానీ, పేకాట ఆడాడని గానీ, తాను ఈ తప్పు చేశానని ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కావాలంటే నా విష‌యంలో ఇవి జ‌రిగాయ‌ని నిరూపించండి అని బండ్ల స‌వాల్ విసిరాడు. నేను చాలా భ‌ద్ర‌త‌తో బ‌య‌ట‌కు వ‌స్తాను అని పేర్కొన్నాడు. అయితే బండ్ల మాట‌లలో అనేక అర్ధాలు వెతుకుతున్నారు నెటిజ‌న్స్. నేను అలాంటి ప‌నులు చేయ‌డం లేదు అని చెప్ప‌డం వేరు, ఒక్క కంప్లెయింట్‌ కూడా రాదు అని చెప్పడం వేరు. ఆయ‌న మాట‌లు ఉద్దేశ్యం ఏంటి? అంటే ఏవైన చేసిన కూడా బ‌య‌ట‌కు రాకుండా మేనేజ్ చేస్తున్నాడా అంటూ కొంద‌రు ముచ్చ‌టించుకున్నారు.