వీడెవడో తేడాగా ఉన్నాడే.. భూమిక కోసం లవ్ లెటర్ రాసి ఆమె భర్తకి షేర్ చేశాడుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఖుషి చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన అందాల ముద్దుగుమ్మ భూమిక. అదిరిపోయే అందం, అంతకు మించిన నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అందాల భామ సుమంత్ తో చేసిన మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాధించుకుది. ఖుషీతో ఈ భామకి ఫుల్ పాపులారిటీ దక్కింది. భూమిక నటించిన మూడో సినిమా మిస్సమ్మతో నంది పురస్కారం దక్కింది. ఆ తర్వాత సింహాద్రి, వాసు, ఒక్కడు, స్వాగతం, అనసూయ, కలెక్టర్ గారి భార్య, మల్లెపూవు, సత్యభామ, మాయాబజార్, జై చిరంజీవ వంటి బ్లాక్ బస్టర్ హిట్లని తన ఖాతాలో వేసుకుంది భూమిక.
స్టార్ హీరోలందరి సరసన నటించిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీఎంట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా లడ్డు బాబు, ఎంసీఏ, రూలర్, ఎమ్.ఎస్. ధోని, బటర్ ఫ్లై, సీతారామం వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన భూమిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ముదురు అందాలతో పిచ్చెక్కిస్తుంటుంది. 45 ఏళ్ల వయస్సులో భూమిక అందాల ఆరబోతతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. భూమిక 2007లో భారత్ ఠాకూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా ఓ అభిమాని భూమికకి రాసిన లవ్ లెటర్‌ని ఆమె భర్తకి షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులకి మంచి వినోదం పంచే భూమిక.. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలని షేర్ చేస్తూ.. ఆ పోస్ట్ కింద కామెంట్ రాసుకురాగా, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక అభిమాని ఆమె భర్తకి ఒక లవ్ లెటర్ పంపించి.. ఇది మీ భార్యకి వినిపించండి అని చెప్పుకొచ్చాడట. ఇక దానిని భూమిక షేర్ చేస్తూ.. ‘ఆ లవ్ లెటర్ తనని ఆకట్టుకుంది’ అంటూ తన పోస్ట్‌లో పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. భూమిక ఇటీవలి కాలంలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.