కామారెడ్డి నుంచి రేవంత్.. చెన్నూరు నుంచి వివేక్..
కాంగ్రెస్ మలి జాబితా విడులైంది. అంతా ఊహించినట్టే వివేక్ కు చెన్నూరు సీటు కేటాయించారు.

విధాత : రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం సోమవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో పెద్దపల్లి మాజీ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జీ వివేక్‌కు చెన్నూరు స్థానాన్ని కేటాయించింది. బోధ్ (ఎస్టీ) స్థానానికి వన్నెల అశోక్ ను మార్చి.. అక్కడ అదే గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. జుక్కల్ (ఎస్సీ) సీటుకు సాదా లక్ష్మీకాంత రావు, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డిని ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికిని ప్రకటించింది. నిజామాబాద్ అర్బన్ నుంచి మహ్మద్ షబ్బీర్ అలీ, కరీంగనగర్ నుంచి పెరుమాళ్ల శ్రీనివాస్, మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో కొండం కరుణ మహేందర్ రెడ్డిని నిలబెట్టింది.
నారాయణఖేడ్ టికెట్‌ను సురేష్ కుమార్ షెట్కార్‌కు కేటాయించింది. పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తారు. వనపర్తిలో అభ్యర్థిని మార్చిన అధిష్ఠానం.. అక్కడ ఇప్పటికే ప్రకటించిన చిన్నారెడ్డి బదులు తూడి మేఘారెడ్డికి అవకాశం ఇచ్చింది. డోర్నకల్ (ఎస్.టి) నుంచి డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్‌ను నిలిపింది. ఇల్లెందు స్థానం కోరం కనకయ్యకే దక్కింది. వైరా నుంచి రాందాస్ మాలోత్ పోటీ చేయనున్నారు. సత్తుపల్లిలో డాక్టర్ మట్టా రాగమయి పోటీ చేయనున్నారు. అశ్వారావుపేట (ఎస్.టి) స్థానాన్ని జారే ఆదినారాయణకు కేటాయించారు.