Suicide | భార్య మరణాన్ని తట్టుకోలేక.. తుపాకీతో కాల్చుకున్న పోలీసు ఆఫీసర్

Suicide | న్యూఢిల్లీ : భార్య మరణాన్ని తట్టుకోలేక.. ఓ పోలీసు ఆఫీసర్ తన పర్సనల్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అనిల్ సిసోడియా(55) అనే వ్యక్తి ఢిల్లీ ఏసీపీ(అసిస్టెంట్ పోలీసు కమిషనర్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అనిల్ భార్య మూడు రోజుల క్రితం మరణించింది. ఆమె మృతితో అనిల్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక.. బుధవారం ఇంట్లోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అనిల్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు ఇంటికెళ్లి చూడగా, ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. పోలీసు ఉన్నతాధికారులు అనిల్ ఇంటికెళ్లి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనిల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.