సునీత భ‌ర్త‌తో క‌లిసి కొత్త ఓటీటీ సంస్థ నెల‌కొల్పే ఆలోచ‌న‌లో దిల్ రాజు

  • By: sn    breaking    Nov 03, 2023 12:20 PM IST
సునీత భ‌ర్త‌తో క‌లిసి కొత్త ఓటీటీ సంస్థ నెల‌కొల్పే ఆలోచ‌న‌లో దిల్ రాజు

ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్ న‌డుస్తుంది. థియేట‌ర్స్ క‌న్నా ఓటీటీకి డిమాండ్ పెరిగింది. ఈ క్ర‌మంలో కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. తెలుగులో ఇప్ప‌టికే ఆహా లాంచ్ కాగా, స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప‌లు షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. అయితే ఇప్పుడు మ‌రో ఓటీటీ సంస్థ కూడా త్వ‌ర‌లోనే లాంచ్ కానుంద‌ని, దీనిని దిల్ రాజు స్థాపించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. సింగ‌ర్ సునీత భ‌ర్త‌తో క‌లిసి ఆయ‌న ఓటీటీ సంస్థ‌ని నెల‌కొల్పే ప్లాన్ చేస్తున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్‌లో ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏది మొద‌లు పెట్టిన అది స‌క్సెస్ కావల్సిందే. ఆయ‌న డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాత‌గా ఎంత స‌క్సెస్ అయ్యారో మ‌నం చూస్తూనే ఉన్నాం.దిల్ రాజు బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంది అంటే అది దాదాపు హిట్ అయినట్టే అనే అభిప్రాయం జ‌నాల‌లో ఉంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా దిల్ రాజు విడుద‌ల చేస్తుంటారు. ఇటీవ‌ల ఆయ‌న చిన్న బ్యానర్ కూడా స్టార్ట్ చేసి 4 ,5 కోట్ల బడ్జెట్లో ఫినిష్ అయ్యే సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ కోవ‌లోనే బ‌లగం అనే సినిమా వ‌చ్చింది. వేణు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెట్టిన రూపాయికి 10 రెట్లు లాభాలు రావ‌డంతో దిల్ రాజు మ‌రింత ముందుడ‌గు వేస్తున్నాడు.

అయితే దిల్ రాజు క్యాంపులో 50 కి పైగా కథలు ఉన్నాయి. వాట‌న్నింటిని సినిమాలుగా రూపొందించి రిలీజ్ చేయడం కష్టం కాబ‌ట్టి సొంత‌గా ఒక ఓటీటీ సంస్థ‌ని స్థాపించి అందులో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. సునీత భర్త.. రామ్ వీరపనేనితో కలిసి దిల్ రాజు ఓటీటీ కోసం సినిమాలు నిర్మించాలని స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. ఇటీవ‌లి కాలంలో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కి పెద్ద‌గా బిజినెస్ జ‌ర‌గ‌డం లేదు కాబ‌ట్టి వాటిని త‌న ఓటీటీ సంస్థ ద్వారా రిలీజ్ చేయాల‌ని ఈ బిజినెస్ ఆలోచ‌న చేసిన‌ట్టు తెలుస్తుంది. మరి దీనిపై రానున్న రోజుల‌లో క్లారిటీ రానుంది.