గెలిపిస్తే ఈటలే సీఎం! కులసంఘాల నేతలకు మోదీ హామీ?
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీని సీఎంగా చేస్తామని గతంలోనే ప్రకటించారు. అయితే.. ఎవరిని చేస్తారన్న విషయంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.

విధాత : రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ సభకు ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ వేదిక వెనుక 36 కుల సంఘాల నాయకులతో మోదీ మాట్లాడారని సమాచారం. ఈ సందర్భగా బీజేపీని గెలిపిస్తే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారని మోదీ చెప్పినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీని సీఎంగా చేస్తామని గతంలోనే ప్రకటించారు. అయితే.. ఎవరిని చేస్తారన్న విషయంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగానే వినిపించినప్పటికీ.. లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతల ప్రస్తావనలూ వచ్చాయి. మంగళవారం నాటి సభకు ముందు ప్రధాని ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో కలియదిరిగినప్పుడు జీపులో మోదీతోపాటు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఈటల కూడా ఉన్నారు. అందులోనూ ఈటల ప్రధాని పక్కనే ఉండటం గమనార్హం.