కీర్తి సురేష్‌కి లవ్ లెటర్.. అందులో ఏం రాసి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా సత్తా చాటిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఏ పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలే కాక వెబ్ సిరీస్‌లకి కూడా సై అంటుంది. బాలీవుడ్‌లోను ఈ భామకి పలు ఆఫర్స్ వస్తున్నాయి. రాధికా ఆప్టేతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనుంది. దీనిపై అంచనాలు ఓ లెవల్‌లో ఉన్నాయి. అయితే కీర్తి తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అందులో మంచి హిట్స్ కూడా ఉన్నాయి. మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట‘, నాని సరసన ‘దసరా’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్.
ఇక కీర్తి సురేష్ సినిమాల పరంగా ఎంత సందడి చేస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతే రచ్చ చేస్తుంటుంది.తన క్యూట్ పిక్స్ షేర్ చేయడంతో పాటు పలు ఇంటర్వ్యూలలో అనేక పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తనకు ఫస్ట్ లవ లెటర్ ఇచ్చిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. తను ఓ నగల దుకాణం ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనకు ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని పేర్కొంది. ఏంటి ఆ బాక్స్ అని ఓపెన్ చేసి చూస్తే అందులో తన అరుదైన ఫొటోలతో పాటు ఓ లెటర్ కూడా ఉందంట. ఆ లెటర్ లో ఆ అభిమాని తనని ప్రేమిస్తున్నట్టుగా రాసుకొచ్చాడంట. తనను పెళ్లి కూడా చేసుకుంటానని అందులో రాసుకొచ్చాడని పేర్కొంది కీర్తి.
అయితే ఆ లవ్ లెటర్ తనని ఎంత థ్రిల్ చేసింది చెప్పలేదు కాని .. స్కూల్, కాలేజీలో అందని లెటర్స్ అభిమాని నుంచి ఇలా అందిందని చెప్పింది. మొత్తానికి కీర్తి లవ్ లెవర్ స్టోరీ విన్న చాలా మంది కూడా తాము కూడా ట్రై చేస్తే ఎలాగుంటుందని భావిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సైరెన్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది. ఈ చిత్రంలో కీర్తి పోలీసు ఆఫీసర్ గా కనిపించి అలరించింది. అయితే తన కెరీర్ లోనే పోలీస్ పాత్రలో కీర్తి మొదటిసారిగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.