సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న సమావేశంలో అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. […]

సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న సమావేశంలో అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.

ఈ క్రమంలో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు.

అయితే.. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెబుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. గతంలోనే బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు.

గత ఆదివారం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైద్రాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. దసరా లోపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కుమారస్వామి ప్రకటించారు. కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత కుమారస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు.

కేసీఆర్ నాయ‌క‌త్వం దేశానికి ఎంతో అవ‌స‌రం

సీఎం కేసీఆర్‌, గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింగ్ వాఘేలా స‌మావేశ‌మ‌య్యారు. ఇరువురు నేత‌ల మ‌ధ్య 5 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిగాయి. తెలంగాణ ప్ర‌గ‌తి, దేశ ప‌రిస్థితులు, జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ పోక‌డ‌ల‌పై, బీజేపీ రాజ‌కీయ క్రీడ‌, ప్ర‌జ‌ల‌పై దాని ప‌ర్య‌వ‌సానాల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించారు.

వాఘేలా సీఎం కేసీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి ఆహ్వానించారు. బీజేపీ రాజ‌కీయాల ప‌ట్ల అంద‌రూ ఆందోళ‌న‌లో ఉన్నార‌ని వాఘేలా తెలిపారు. మోడీ విచ్ఛిన్న‌క‌ర పాల‌న‌పై దేశ‌మంతా ఆందోళ‌న‌లో ఉంద‌న్నారు. ప్ర‌జాస్వామిక‌వాదులు, ప్ర‌గ‌తి కాముకులు మౌనంగా ఉండొద్ద‌న్నారు.

ప్ర‌స్తుతం కేసీఆర్ నాయ‌క‌త్వం దేశానికి ఎంతో అవ‌స‌రమ‌న్నారు. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల‌న్నారు. బీజేపీ దుర్మార్గ రాజ‌కీయాలు తిప్పికొట్టాల‌ని గుజ‌రాత్ మాజీ సీఎం పేర్కొన్నారు.
వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశ రాజ‌కీయాలు, పాల‌న‌లో గుణాత్మ‌క మార్పున‌కు కృషి చేస్తాన‌న్నారు. వాఘేలా వంటి సీనియ‌ర్ల స్వ‌చ్ఛంద మ‌ద్ద‌తు ప‌ట్ల సీఎం హ‌ర్షం వ్య‌క్తం చేశారు