నా బాయ్ ఫ్రెండ్‌తోనే నిద్రిస్తావా..? యువ‌తిపై దాడి చేసిన ప్రియురాలు.. వీడియో

త‌న ప్రియుడు మ‌రో అమ్మాయితో తిరిగినా, స‌న్నిహితంగా మెలిగినా.. ప్రియురాలికి కోపం రావ‌డం స‌హ‌జం. కొన్ని సంద‌ర్భాల్లో ప్రియుడికి బ్రేక‌ప్ చెప్ప‌డం జ‌రుగుతుంది. లేదంటే త‌మ ప్రేమ జీవితంలోకి ప్ర‌వేశించిన మూడో వ్య‌క్తిని టార్గెట్ చేస్తారు.

నా బాయ్ ఫ్రెండ్‌తోనే నిద్రిస్తావా..? యువ‌తిపై దాడి చేసిన ప్రియురాలు.. వీడియో

త‌న ప్రియుడు మ‌రో అమ్మాయితో తిరిగినా, స‌న్నిహితంగా మెలిగినా.. ప్రియురాలికి కోపం రావ‌డం స‌హ‌జం. కొన్ని సంద‌ర్భాల్లో ప్రియుడికి బ్రేక‌ప్ చెప్ప‌డం జ‌రుగుతుంది. లేదంటే త‌మ ప్రేమ జీవితంలోకి ప్ర‌వేశించిన మూడో వ్య‌క్తిని టార్గెట్ చేస్తారు. వారిపై దాడుల‌కు కూడా వెనుకాడ‌రు. ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం చూస్తూనే ఉంటాం.

అయితే ఓ అమ్మాయి కూడా త‌న ప్రియుడిని మ‌న‌సారా ప్రేమిస్తోంది. కానీ అత‌నేమో మ‌రో అమ్మాయితో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్టు ప్రియురాలికి అనిపించింది. తీరా ఆ యువ‌తి త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి నిద్రిస్తున్న‌ట్లు ప్రియురాలికి అనుమానం క‌లిగింది. దీంతో ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి.. ప్రియురాలు దాడి చేసింది. ఆమెపై పంచ్‌ల వ‌ర్షం కురిపించింది. విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది. అడ్డుకోబోయిన కుక్క‌ను కూడా ప్రియురాలు ప‌క్క‌కు నెట్టేసింది.

చివ‌ర‌కు ప్రియురాలి దెబ్బ‌లు తాళ‌లేక‌.. ఆ ఇంటి నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్తింది. ఇంటి బ‌య‌ట ఉన్న సైకిల్‌పై ఆమె స్పీడ్‌గా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సీసీటీవీ ఇడియ‌ట్స్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ వ్య‌వ‌హారంలో ఆమె త‌ప్పు ఏం లేద‌ని, ప్రియురాలిదే త‌ప్పు అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న విబేధాలే ఇందుకు కార‌ణ‌మ‌నిపిస్తోంద‌ని పేర్కొన్నారు. అయినా బాయ్ ఫ్రెండ్‌కు బుద్ది చెప్పుకోవాలి కానీ.. ఇత‌రుల‌పై దాడి స‌రికాద‌ని ప్రియురాలిని తిట్టిపోశారు నెటిజ‌న్లు.