Viral Video | లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలిక.. 20 నిమిషాలు నరకయాతన

Viral Video |
బహుళ అంతస్తుల భవనాల్లో అప్పుడప్పుడు లిఫ్ట్‌లు మొరాయిస్తుండటం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో లిఫ్ట్‌లు కూలిపోవడం, మధ్యలోనే ఆగిపోవడం, లేదంటే తెరుచుకోకపోవడంతో ఊపిరాడక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం.
ఓ చిన్నారి కూడా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. రక్షించండి అంటూ కేకలు వేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలిక.. 20 నిమిషాలు నరకయాతన https://t.co/bO6gNC9808 #viral #viralvideo #India #TeluguNews pic.twitter.com/bCl0Z1XaF7
— vidhaathanews (@vidhaathanews) October 5, 2023
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని జనేశ్వర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఓ బాలిక లిఫ్ట్ ఎక్కింది. అది మధ్యలోనే ఆగిపోయింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆ అమ్మాయి.. సీసీ కెమెరా వైపు చూస్తూ రక్షించండి అమ్మా అంటు పలుమార్లు అరిచింది.
లిఫ్ట్ డోర్లను తెరిచేందుకు తన శక్తినంతా ప్రయోగించింది. ఆ డోర్లు తెరుచుకోకపోవడంతో.. ఆందోళనకు గురైంది. దాదాపు 20 నిమిషాల తర్వాత బాలికను ప్రాణాలతో కాపాడినట్లు తెలిసింది.