Gold Rates | హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు ఇవే..!

Gold Rates | హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు ఇవే..!

Gold Rates | గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో బంగారం కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.61,250 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.66,820 వద్ద కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,470 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,820కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,970 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.61,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,820 వద్ద కొనసాగుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,500 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.