ఫుడ్ డెలివరీ బాయ్ నిర్వాకం.. మిల్క్ షేక్‌కు బదులుగా యూరిన్ బాటిల్ డెలివరీ

ఇది ఊహించని ఘటన.. షాకింగ్ ఘటన కూడా. ఆకలిగా ఉండటంతో ఓ యువకుడు ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. అయితే మిల్క్ షేక్‌కు బదులుగా యూరిన్‌తో కూడిన బాటిల్‌ను ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేశాడు. యువకుడు కూడా అనుకోకుండా ఆ బాటిల్‌లోని మూత్రాన్ని తాగేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన కాలేబ్ వుడ్ అనే యువకుడు ఇటీవలే గ్రూబుబ్ యాప్ ద్వారా చిక్ ఫిల్ ఏ రెస్టారెంట్ నుంచి ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. ఆ రెండింటిని తీసుకున్న డెలివరీ బాయ్.. కాలేబ్ ఇంటికి చేరుకున్నాడు. అతనికి డెలివరీ చేశాడు. ఇక ఫ్రైస్ తిన్న ఆ యువకుడు.. మిల్క్ షేక్ బాటిల్ ఓపెన్ చేశాడు. దాన్ని సేవించగా, అది యూరిన్ అని గమనించాడు.
దీంతో యువకుడు గ్రూబూబ్ డెలివరీ బాయ్‌ను ప్రశ్నించాడు. తన వద్దే తప్పిదం జరిగిందని బాయ్ పేర్కొన్నాడు. లాంగ్ వర్కింగ్ అవర్ సమయంలో కారులో ఉన్న ఓ బాటిల్‌లో మూత్రవిసర్జన చేశానని తెలిపాడు. కన్ఫ్యూజన్‌లో మిల్క్ షేక్ బాటిల్‌కు బదులుగా యూరిన్ ఉన్న బాటిల్ డెలివరీ చేశానని అంగీకరించాడు. దీంతో కాలేబ్ షాక్‌కు గురయ్యాడు.